‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నుంచి ఫస్ట్‌ సాంగ్‌

 


సుధీర్‌ బాబు, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా.. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇటీవలే విడుదలైన టీజర్‌కి చక్కటి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మెలోడీ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘‘ఓ అల్లంత దూరాన నువ్వు నీ కనులు నన్నే చూస్తుంటే ఏం చేయాలో’’ అంటూ మొదలయ్యే పాటను అభయ్‌, చైత్ర ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Post a Comment

Previous Post Next Post